రాఘవేంద్రరావు సరసన సీనియర్ నటి ?

Published on Jun 5, 2021 3:01 am IST

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెయిన్ లీడ్ గా ఓ సినిమా కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన తన సుదీర్ఘ కెరీర్ లో ఆయన చేయకుండా మిగిలిపోయింది నటన ఒక్కటే. ఇప్పుడు నటన కూడా చేయబోతున్నారు. రచయిత నటుడు తనికెళ్ల భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రధారిగా రానున్న సినిమాలో సీనియర్ నటి లక్ష్మీ మరో ప్రధాన పాత్రలో నటించబోతుందట.

ఇంతకీ ఆమె ఏ పాత్రలో నటిస్తోంది అంటే.. రాఘవేంద్రరావుకి జోడీగా నటించబోతుందట. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తీ అయింది. ఈ సినిమాలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా రాఘవేంద్రరావు కనిపించనున్నాడు. ఆయన భార్యగా నటి లక్ష్మి కనిపిస్తారు. అలాగే హీరోయిన్ శ్రీయా కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుందని గ్యాసిప్ లు ఇప్పటికే వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :