హౌస్ నుండి ఆముగ్గురిలో బయటికెళ్ళేది ఎవరు?

Published on Sep 19, 2019 12:02 am IST

ఈవారం ఎలిమినేషన్ కొరకు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఇంటి సభ్యులలో గల మహేష్ విట్టా, రాహుల్, హిమజ ఎలిమినేషన్ కొరకు ఎంపిక కాబడ్డారు. కాబట్టి వచ్చే వారం ఈ ముగ్గురిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లనున్నారు. మొదటినుండి మనం ఓ విషయం గమనించినట్లైతే దాదాపు ప్రతివారం ఎలిమినేషన్ కొరకు ఎంపిక కాబడ్డ సభ్యులలో వీరి పేర్లు ఉండేవి. హిమజ, మహేష్, రాహుల్ ఎక్కువగా నామినేట్ కాబడిన ఇంటి సభ్యులు. కానీ ఆశ్చర్యకరంగా ప్రతివారం వీరు తప్పించుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం వీరిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పాల్సిన పరిస్థితి.

ఇక ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటికెళ్లిన సభ్యులలో ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరలా హౌస్ లోకి ప్రవేశించే అవకాశం కలదు. గతవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అవగా, అంతకు ముందు వారం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న అలీ రెజా అనూహ్యంగా ఎలిమినేట్ కావడం జరిగింది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు వెళ్లనున్నారో,హౌస్ లోకి ఎవరు రానున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More