ఎఫ్‌.డి.సి చైర్మ‌న్ ప‌ద‌విని జగన్ ఆమెకే ఇస్తారా ?

Published on Jun 2, 2019 3:23 pm IST

ఆంధ‌ప్ర‌దేశ్ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌దవికి కృష్ణ రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారో అనే చర్చ పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో తీవ్రంగా కొనసాగుతోంది. సినిమా రంగానికి చెందిన పదవి కాబట్టి సినిమా వాళ్లకే అందుతుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ అందదేది ఎవరికనేదే ఇక్కడి ప్రశ్న. ఎందుకంటే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి.

ఈసారి ఎన్నికల్లో వైకాపాకు సినీ రంగ ప్రముఖులు మోహన్ బాబు, జీవితా రాజశేఖర్, జయసుధ, పృథ్వి, అలీ, పోసాని లాంటి పలువురు బాగా సపోర్ట్ చేశారు. వీరిలో ఎఫ్‌.డి.సి చైర్మ‌న్ పదవి రేసులో సీనియర్ నటి జయసుధ ముందంజలో ఉన్నారు. ఆమెకే పదవి దక్కే ఆస్కారం ఎక్కువగా ఉందని అంటున్నారు. మరోవైపు జీవితా రాజశేఖర్, సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సీనియర్ నటుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మొదటి నుండి వీరాభిమాని అయిన విజయ్ చందర్ పేరు కూడా వినిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

More