అఖిల్ సరసన జోడీ కట్టేదెవరు.?

అఖిల్ సరసన జోడీ కట్టేదెవరు.?

Published on Oct 12, 2014 9:55 PM IST

Akhil (1)
అక్కినెఇ ఫ్యామిలీ నుంచి త్వరలోనే హీరోగా పరిచయం కానున్న యంగ్ అండ్ హాన్డ్సం హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నాడు.

ప్రస్తుతం అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న.. అఖిల్ మొదటి సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరు.? చూడటానికి బాగా హన్డ్సంగా ఉండే అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ కూడా బాగా గ్లామరస్ గా ఉండాలని ఆశిస్తారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ భామ అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి, కానీ అవి ఎవరూ ఖరారు చేయలేదు. దాంతో ఎవరు హీరోయిన్ గా నటించనున్నారా.? అనే ప్రశ్న అలానే ఉండిపోయింది.

అఖిల్ కూడా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని, అందుకోసం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నానని ఇది వరకే తెలియజేశాడు. మనం సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ తో అందరి మనసూ దోచుకున్న అఖిల్ ఇటీవలే రిలీజ్ అయిన టైటన్ యాడ్ తో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు.

తాజా వార్తలు