వైవిధ్యభరితమైన కథాంశాలతో తెలుగు యువహీరోల్లో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న సందీప్ కిషన్, తాజాగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఓ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమా ద్వారా స్టార్ రైటర్ టీ. రాజసింహ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ రోజు ఉదయం నుంచి ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన జాదూగాడు ఫేం సొనారిక బడోరియా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అనే వార్తలు వస్తున్నాయి.
కానీ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అది నిజం కాదని, సొనారికని సందీప్ కిషన్ కి జోడీగా ఎంపిక చేయలేదు అని తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన ఓ స్టార్ హీరోయిన్ జోడీ కట్టనుందని, ప్రస్తుతం ఆ స్టార్ హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నామని త్వరలోనే ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తామని తెలిపారు. మరి సందీప్ కిషన్ సరసన నటించబోయే ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ లోపు మీరు ఏ స్టార్ హీరోయిన్ అయితే సందీప్ కిషన్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనే దానిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తెలపండి.
మిక్కీ జే మేయర్, చోటా కె నాయుడు, అనల్ అరసు ఇలా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ భోజ్‌పురి సినిమా నటుడు రవి కిషన్ నటించడం మరో ఆసక్తికరమైన విషయం.


