“కేజీయఫ్ 2” కు అక్కడ కళ్ళు చెదిరే ఫిగర్ డిమాండ్ చేస్తున్నారా?

Published on Feb 6, 2021 7:03 am IST

ఇప్పుడు మన దేశంలో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ లేపడానికి రెడి అవుతున్న భారీ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాకింగ్ స్టార్ యష్ తో తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ బాక్స్ ఆఫీసును మోత మోగించడం ఖాయం అని చెప్పాలి. చాప్టర్ 1 తర్వాత చాప్టర్ 2 కు ఓ రేంజ్ లో హైప్ పెరిగింది.

మరి ఆ హైప్ ను మేకర్స్ గట్టిగానే వినియోగించుకుంటున్నారని తెలుస్తుంది. మరి అలా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి ఈ సినిమా బిజినెస్ కోసం తెలుస్తుంది. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రానికి ఏ స్థాయి క్రేజ్ ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఇంత మొత్తంలో కనుక కొంటే ఇది ఒక సరికొత్త రికార్డే అని చెప్పాలి. మరి ఈ కళ్ళు చెదిరే ఫిగర్ ను నిజంగానే డిమాండ్ చేసారా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :