నిఖిల్ సినిమాలే ఎందుకిలా ?

నిఖిల్ సినిమాలే ఎందుకిలా ?

Published on Jul 4, 2019 7:53 PM IST

హీరో నిఖిల్ కి ఈ మధ్య అసలు టైం కలిసిరావడం లేదు. ఒక పక్క తోటి హీరోలు వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉంటే.. నిఖిల్ మాత్రం చేసిన సినిమాలని కూడా రిలీజ్ చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద వెనుకబడిపోతున్నాడు. గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ పరిస్థితి ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చిత్రబృందం కూడా చెప్పలేని స్థితిలో ఉంది. పైగా ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న శ్వాస చిత్రం షూటింగ్ కూడా ఆగిపోయిందట. అయితే సినిమా ఆగిపోయిందా లేక ప్రస్తుతానికి షూటింగ్ అపారా అనేది తెలియాల్సి ఉంది.

ఏమైనా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే నిఖిల్ సినిమాలు ఇలాంటి సమస్యల్లో పడటం ఆశ్చర్యకరమే. ఇక చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ సినిమా చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది. స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి నిఖిల్ కి ‘కార్తికేయ 2’నైనా కలిసి వస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు