‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?

మెగాస్టార్ చిరంజీవి ఇచ్చే లీక్స్ సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ అవుతాయో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి తన లీక్‌తో చిరు అందరినీ పక్కదోవ పట్టించారు. దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇటీవల ఆయన ‘కదిరి’ అనే టైటిల్‌ను లీక్ చేశారు.

దీంతో అందరూ దాన్నే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు. తీరా చూస్తే, తాజాగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌ ద్వారా ఈ చిత్రానికి ‘కాకా’ అనే మాస్ టైటిల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. మొదట ‘కదిరి కాకాజీ’ అనే పేరును అనుకున్నప్పటికీ, చివరికి ‘కాకా’ వైపే మొగ్గు చూపారు.

సోషల్ మీడియాలో టైటిల్ ముందే లీక్ కాకుండా చూడటంతో పాటు, సినిమాపై మైండ్ గేమ్ ఆడి హైప్ పెంచడానికే చిరంజీవి కావాలనే తప్పుడు టైటిల్ లీక్ చేశారని స్పష్టమవుతోంది. ఈ మైండ్ గేమ్ బాగా వర్కౌట్ అయి, ‘కాకా’ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Exit mobile version