యూనివర్సల్ స్టోరీస్ వదిలేసి, ఫ్యామిలీ సెంటిమెంట్ కే ఓటేసిన ఎన్టీఆర్.

యూనివర్సల్ స్టోరీస్ వదిలేసి, ఫ్యామిలీ సెంటిమెంట్ కే ఓటేసిన ఎన్టీఆర్.

Published on Feb 20, 2020 6:57 AM IST

కొన్ని నెలలుగా ఎన్టీఆర్ 30వ చిత్రంపై సినీ వర్గాలతో పాటు, అభిమానులలో భారీ చర్చ నడిసింది. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసే సినిమా ఏమై ఉంటుంది? ఏ దర్శకుడితో చేస్తారు? అనే తీవ్ర చర్చ నడిచింది. ఎట్టకేలకు ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మాతలు ఊహాగానాలకు చెక్ పెడుతూ త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఎన్టీఆర్ గత చిత్రం అరవింద సమేత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా, ఈసారి త్రివిక్రమ్ కి కలిసొచ్చిన ఫ్యామిలీ డ్రామాతోనే ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ‘అయిననూ హస్తిన పోయిరావలె’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి ఉంచారు. టైటిల్ పరిశీలించినా ఇది ఫ్యామిలీ డ్రామా లేదా పొలిటికల్ థ్రిల్లర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఐతే పొరుగు పరిశ్రమలకు చెందిన ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్స్ సిద్ధం చేసి రెడీగా ఉన్నారు. యంగ్ తమిళ్ డైరెక్టర్ అట్లీ, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యూనివర్సల్ స్టోరీస్ తో ఎన్టీఆర్ సినిమా చేయాలని భావిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ కి ఎటూ పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది. కాబట్టి యూనివర్సల్ స్టోరీస్ తో భారీ చిత్రాలు చేయాలనుకున్న ఈ ఇద్దరు దర్శకులను కాదని ఎన్టీఆర్ త్రివిక్రమ్ తయారు చేసిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాకు ఓటేశారు. సహజంగా పొరిగింటి పుల్ల కూర రుచి అంటారు. ఎన్టీఆర్ కి మాత్రం రుచి ఎలా ఉన్నా, ఇంటి కూరే బెటర్ అని ఫిక్స్ అయినట్టున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు