సైరా పై ఎన్టీఆర్ మౌనం వహించారెందుకో… !

Published on Oct 9, 2019 7:01 am IST

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. పేట్రియాటిక్ మూవీ కావడంతో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజువల్ వండర్ తెరకెక్కడంతో ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతల నుండి హీరోలు అలాగే హీరోయిన్స్ సైరా గురించి తమ స్పందన తెలియజేశారు. కానీ ఒక్క ఎన్టీఆర్ మాత్రం సైరా చిత్రం గురించి అసలు ఏవిధంగాను స్పందించ లేదు.

మహేష్ ఒక ప్రక్కన ట్విట్టర్ వేదికగా సైరాని ప్రశంసించగా, నాగ్ ఫ్యామిలీ చిరుతో కలిసి ఈ చిత్రాన్ని చూశారు. ఇక ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితులతో ఒకరైన రాజమౌళి కూడా సైరా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేయడం జరిగింది. చరణ్ తో మంచి స్నేహం కలిగి ఉన్న ఎన్టీఆర్ మిత్రుడు నిర్మించిన సినిమా పై స్పందించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొద్దికాలంగా మంచి మిత్రులుగా ఉన్న చరణ్ ఎన్టీఆర్ లు ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి మరింత సన్నిహితంగా ఉంటున్నారు. ఒక వేళ బిజీ షెడ్యూల్ వలన, సైరా చిత్రాన్ని ఇంకా చూడకపోవడం వలన ఆయన చిత్రం పై ఎటువంటి కామెంట్ చేయలేదేమో…?

సంబంధిత సమాచారం :

More