రాజశేఖర్ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం అదేనా ?

Published on Jun 26, 2019 11:00 pm IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’ జూన్ 28న రిలీజ్ అవుతుంది. అయితే చిత్రబృందం సరిగ్గా ప్రమోషన్స్ చేయట్లేదని నెటిజన్లు ఇప్పటికే కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం రాజశేఖర్ నిన్న అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అందుకే ఈ రెండు రోజులు ప్రమోషన్స్ ప్లాన్ చేసినా.. రాజశేఖర్ ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే.. ప్రమోషన్స్ ను వేగవంతంగా చేయలేకపోతున్నారట.

ప్రస్తుతం రాజశేఖర్ కి జ్వరంతో బాధ పడుతున్నప్పటికి టీవీ ఛానెల్స్ లోనైనా సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More