అక్కినేని వారి వేడుకలో ఆమె ఏమైనట్టు?

Published on Nov 18, 2019 8:52 am IST

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డుల వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ ఏడాదికి గాను సౌత్ పరిశ్రమకు చెందిన ఇద్దరు అలనాటి టాప్ హీరోయిన్స్ రేఖా, దివంగత శ్రీదేవికి అక్కినేని నేషనల్ అవార్డ్ ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.

అలాగే నాగేశ్వర రావు కుటుంబానికి చెందిన మూడు తరాల వారసులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఐతే అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, నాగచైతన్య భార్య సమంత అక్కినేని కనిపించక పోవడం గమనార్హం. అక్కినేని కుటుంబానికి చెందిన అందరు కుటుంబసభ్యులు పాల్గొన్న ఈ వేడుకలో ఆమె కనిపించకపోవడం ఒకింత లోటుగా అనిపించింది. ప్రస్తుతం సమంత నటిస్తున్న 96 మూవీ షూటింగ్ కూడా పూర్తయిన నేపథ్యంలో సమంత హాజరుకాకపోవడానికి గల కారణం అర్థం కాలేదు. ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని వార్తలు వస్తున్న తరుణంలో దాని షూటింగ్ వలన సమంత ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయి ఉండవచ్చు.

సంబంధిత సమాచారం :

More