‘వైఫ్‌,ఐ’ కోసం షూటింగ్ పూర్తిచేసిన ‘టెంప్ట్ ర‌వి’ !

‘వైఫ్‌,ఐ’ కోసం షూటింగ్ పూర్తిచేసిన ‘టెంప్ట్ ర‌వి’ !

Published on Jul 20, 2019 12:01 AM IST

ఇటీవ‌ల యూట్యూబ్ లో టీజ‌ర్ తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన ఏడుచేప‌ల క‌థలో టెంప్ట్ రవిగా దూసుకుపోయిన అభిషెక్ రెడ్డి, గుంజన్ జంట‌గా, జి.చ‌రితా రెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్ మ‌రియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్ గా అంతం అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జి.ఎస్‌.ఎస్‌.పి.క‌ళ్యాణ్ ద‌ర్శ‌కుడిగా నిర్మిస్తున్న ఈచిత్రానికి “వైఫ్,ఐ” అనే టైటిల్ ని ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.. ఈ చిత్రానికి నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్ అనే క్యాప్ష‌న్ ని పెట్టారు.. ఈ చిత్రం యెక్క ఫస్ట్ లుక్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు జి.ఎస్‌.ఎస్‌.పి క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం లో భార్య‌, భర్త మధ్య వుండే అన్ని ర‌సాలు క‌ల‌గలుపుగా వుంటాయి.. పూర్తి రొమాంటిక్ కామెడీ గా తెర‌కెక్కిస్తున్నాము అని అన్నారు.

నిర్మాత జి.చ‌రితా రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి క‌థ‌లు ఈ జెన‌రేష‌న్ లో రావాలి.. అంద‌రూ త‌ప్ప‌కుండా చూడాలి.. వైవాహిక జీవితాలు నాశ‌నం అయిపోతున్న రోజులు.. భార్యాభర్త మధ్య ప్రేమ‌లు పోయి అసూయ‌లు పెరుగుతున్న రోజులివి. అస‌లు వీటి కార‌ణం తెలుసుకోలేకపోతున్నారు ఈ క‌థ‌లో ఈ పాయింట్ నాకు బాగా న‌చ్చింది. “వైఫ్,ఐ” మెద‌టి లుక్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. షూటింగ్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి.. ఈ చిత్ర విజ‌యం పూ మా యూనిట్ అంతా ధీమా గా వున్నారు. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు