‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్.. ‘అల వైకుంఠపురములో’ రేంజ్ మ్యాజిక్ చేస్తుందా?

‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్.. ‘అల వైకుంఠపురములో’ రేంజ్ మ్యాజిక్ చేస్తుందా?

Published on Sep 18, 2026 5:36 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శనంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కోసం అభిమానులు ఫ్యామిలీ ఆడియోస్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకీ మామ, పైగా ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ని మేకర్స్ అతి త్వరలోనే విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకి ఒక చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని సిద్ధం చేసినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మెయిన్ గా అల వైకుంఠపురములో సినిమాకి వర్క్ చేసిన సాహితీ రచయిత రామ జోగయ్య శాస్త్రి మరో చార్ట్ బస్టర్ సాంగ్ ని అందించినట్టుగా తెలుస్తుంది.

దీన్నే ఇప్పుడు ఈ సినిమా నుంచి మొదటి పాటగా విడుదల చేయనున్నారు. దీనిపై ఈ రెండు రోజుల్లో ఒక క్లారిటీ రానుంది. సో అల వైకుంఠపురములో ఫస్ట్ సింగిల్ లాగానే ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ కూడా భారీ రెస్పాన్స్ ని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి హారిక హాసిని నిర్మాణ సంస్థ నిర్మాణం అందించగా ఈ అక్టోబర్ 2న సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు