స్మాల్ స్క్రీన్ పై కూడా “అఖండ” రికార్డులు తిరగ రాస్తుందా?

స్మాల్ స్క్రీన్ పై కూడా “అఖండ” రికార్డులు తిరగ రాస్తుందా?

Published on Apr 10, 2022 5:20 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ యాక్షన్ సినిమా “అఖండ” ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఒక పక్క బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా రీసెంట్ గా ఓటిటి లో కూడా రికార్డు రెస్పాన్స్ తో సౌత్ ఇండియా సినిమా దగ్గర నెంబర్ 1 సినిమాగా నిలిచింది.

ఇక ఈరోజు తెలుగు ఛానెల్ స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేస్తుండగా అఖండ కి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో అనుకున్న దానికన్నా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

అదే విధంగా ఓటిటి లో అయితే ఎన్నో ఎక్స్ క్లూజివ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యినా వాటిని మించి రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. ఇలాం కంటిన్యూస్ గా మాసివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా వాటి లెక్కన బుల్లితెర పై కూడా రికార్డులు బ్రేక్ చెయ్యడం గ్యారెంటీ అనిపిస్తుంది. మరి ఇక్కడ ఎంత రేటింగ్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు