ప్రకాష్ రాజ్ మూవీకి ఎఆర్ఆర్ మ్యూజిక్ అందిస్తాడా.?

ar-rahaman-prakash-raj

సౌత్ లో ఇప్పటి వరకూ హీరోయిన్ గా పలువురు స్టార్ హీరోస్ సరసన సినిమాలు చేసిన హీరోయిన్ అమలా పాల్. తను నిర్మాతగా మారుతూ ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ఫేమస్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాకి శ్రీకారం చుట్టింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎఆర్ రెహమాన్ ని మ్యూజిక్ కంపోజర్ గా సెలక్ట్ చేసే పనిలో ఉన్నారని, అది కూడా ఎఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ మాత్రమే అందించనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ విషయంపై అమలా పాల్ భర్త మరియు డైరెక్టర్ ఎఎల్ విజయ్ క్లారిటీ ఇచ్చాడు. మేము సినిమా మొత్తం అయ్యాక ఎడిట్ చేసి ఈ సినిమాని ఎఆర్ రెహమాన్ కి చూపిస్తాం. ఆ తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చెయ్యాలా వద్దా అన్నది ఆయనే నిర్ణయిస్తారని ఎఎల్ విజయ్ తెలిపాడు. ప్రకాష్ రాజ్ తో పాటు శ్రేయ రెడ్డి, అశోక్ శెల్వన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్న ఈ సినిమాని ఎయిడ్స్ పై అవేర్ నెస్ తీసుకురావడానికి చేస్తున్నారు.

Exit mobile version