బాలకృష్ణ నెగిటివ్ టైటిల్ ని ఎంచుకున్నాడా??

బాలకృష్ణ నెగిటివ్ టైటిల్ ని ఎంచుకున్నాడా??

Published on May 13, 2014 10:41 PM IST

balakrishna
సత్య అనే దర్శకుడితో నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమా తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నాడు. బాలయ్య గత చిత్రాల మాదిరే ఈ సినిమాకూడా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు గాడ్సే అనే టైటిల్ ని అనుకుంటున్నారట

కానీ ఈ టైటిల్ వినగానే మొదట తొలిచే ప్రశ్న ఏమిటంటే గాడ్సే వంటి టైటిల్ ని వాడడానికి బాలయ్యబాబు అంగీకరించాడా అని.. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిగా గాడ్సే పేరు ఇండియాలో చాలా ప్రతికూల పేరుగా నిలిచింది

ఇటువంటి నెగిటివ్ టైటిల్ తో బాలయ్య తన హీరోయిజాన్ని పండించగాలడా అన్నది ఆసక్తికరమైన అంశం

తాజా వార్తలు