చిరు-జగన్ భేటీ కి బాలయ్య?

Published on Jun 5, 2020 10:58 am IST

చిరంజీవి అధ్యక్షతన చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని కీలక సమావేశాలకు బాలయ్యను పిలవకపోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో అలజడి రేపిన సంగతి తెలిసిందే. బాలయ్య కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేయగా ఈ విషయంపై పరిశ్రమ వర్గాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఐతే చిరంజీవితో కూడిన చిత్ర ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలువనున్నారు.

ఈనెల 9న జరగనున్న ఈ సమావేశానికి బాలయ్యను కూడా ఆహ్వానించాలని వీరు భావిస్తున్నారట. గతంలో ఏర్పడిన వివాదాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే చిత్ర ప్రముఖులు అందరినీ పిలవాలని వారు భావిస్తున్నారు. మరి ఈ ఆహ్వానాన్ని స్వీకరించి బాలయ్య సీఎం జగన్ తో మీటింగ్ కి హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :

More