చాలా కాలం తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ ని సెట్ చేసుకుని రాబోతున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రమే “ధురంధర్ 2”. రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఎనలేని అంచనాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇలా భారీ లెవెల్లో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పై ఆల్రెడీ మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఎంత భారీ హైప్ ఉన్న సినిమా అయినా అక్కడ జనాన్ని మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రాబట్టాలి అంటే డెఫినెట్ గా కంటెంట్ మాత్రమే తీసుకురావాలి. అలా ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ లో వచ్చిన క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో కొన్ని మొదటి పార్ట్ కంటే ఎక్కువ వసూళ్లు అందుకున్నవీ ఉన్నాయి. అలానే పార్ట్ 1 కంటే తక్కువ వసూళ్లు కూడా అందుకున్న సీక్వెల్ సినిమాలు ఉన్నాయి.
ఇప్పుడు ఇదే ధురంధర్ 2 ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇండియన్ సినిమా దగ్గర నెక్స్ట్ లెవెల్ హైప్ ని బజ్ ని క్రియేట్ చేసి వచ్చిన సీక్వెల్ చిత్రాల్లో మొదటిగా మాట్లాడుకునే సినిమానే బాహుబలి 2. ఇది పార్ట్ 1 కి ఎన్నో రెట్లు వసూళ్లు తీసుకొచ్చింది. ఈ లెక్కన ధురంధర్ పార్ట్ 1 కే దగ్గరగా 1300 కోట్లు వసూళ్లు కేవలం హిందీలోనే వచ్చేసాయి.
ఇప్పుడు సీక్వెల్ కి అంతకు మించే రేంజ్ లో పెర్ఫామ్ చేయాల్సి ఉంది. అయితే పార్ట్ 1 రాణించినంత బాగా పార్ట్ 2 ఆడుతుంది అని చెప్పడానికి కూడా లేదు. ఆ మధ్య కోలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 కూడా భారీ లెవెల్లో వసూళ్లు రాబట్టింది. దాదాపు ధురంధర్ 1 లానే కేవలం ఒక్క భాషలోనే అత్యధిక వసూళ్లు దానికీ వచ్చాయి.
కానీ సీన్ కట్ చేస్తే పార్ట్ 2 వసూళ్లు పార్ట్ 1 వసూళ్ళని కూడా దాటలేదు. సో ఇలా చాలా మంది ధురంధర్ 2 కూడా పార్ట్ 1 ని దాటుతుందా లేదా అని కూడా అనుకుంటున్నారు. సో ధురంధర్ పార్ట్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బాహుబలి 2 అవుతుందా లేక పొన్నియిన్ సెల్వన్ 2 గా నిలుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
