గుణ శేఖర్-రానా ల హిరణ్య కశిప మొదలయ్యేదెప్పుడు?

గుణ శేఖర్-రానా ల హిరణ్య కశిప మొదలయ్యేదెప్పుడు?

Published on Sep 15, 2019 8:01 PM IST

తెలుగులో టాలెంటెడ్ దర్శకులలో గుణ శేఖర్ ఒకరు. ఆయన కెరీర్ ప్రారంభం నుండి తీసినవి కొద్ది చిత్రాలే అయినా వాటిలో చెప్పుకోదగ్గ చిత్రాలే చాలా ఎక్కువ. రామాయణం, చూడాలనివుంది, ఒక్కడు, అర్జున్ వంటి బ్లాక్ బస్టర్ మరియు సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2015లో అనుష్క తో చేసిన పీరియాడిక్ చిత్రం రుద్రమదేవి కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఆ చిత్రం విడుదలై దాదాపు ఐదేళ్లు కావస్తుంది. ఇంత వరకు ఆయన మరో చిత్రం మొదలుపెట్టింది లేదు. ఐతే కొద్దినెలల క్రితం ఆయన దగ్గుబాటి రానాతో ‘హిరణ్య కశిప’ పేరుతో ఓ భారీ పౌరాణిక చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఆ చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ రాకపోవడం గమనార్హం. మరో వైపు రానా తెలుగులో విరాటపర్వం చిత్రంతో పాటు హిందీ, తమిళంలో కొన్ని సినిమాలకు కమిటై ఉన్నారు. మరి హిరణ్య కశిప ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం వలన ఈ చిత్రం లేట్ అవుతుందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలియదు. సినీ అభిమానులు మాత్రం ఈ ప్రతిష్టాత్మ చిత్రంపై ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు