‘భారతీయుడు 2’కు మళ్లీ మొదలు పెడతాడా ?

Published on Apr 18, 2019 12:00 am IST

కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను ఎప్పటి నుండో రూపొందించాలని ప్లాన్ చేసుకొని.. చివరికి సినిమాను చెన్నైలో ఘనంగా ప్రారంభం చేసి.. మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసే సమయంలో కొన్ని కారణాల వల్ల మధ్యలోనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. ఎందుకో షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు.

కాగా బడ్జెట్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విభేదాలు వచ్చాయి అందుకే సినిమా మొదలవట్లేదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ప్రస్తుత ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేస్తుండటం వల్ల సినిమా పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజమో ? మొత్తానికి అయితే ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపించట్లేదు.

సంబంధిత సమాచారం :