రక్తపాతంతో మొదలుకానున్న ‘ఇరుముడి’ ?

రక్తపాతంతో మొదలుకానున్న ‘ఇరుముడి’ ?

Published on Jul 19, 2026 10:00 AM IST

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఐతే, ఇప్పటివరకూ ప్రమోషనల్ కంటెంట్ ను బట్టి ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప మాలలో కనిపిస్తాడని.. ఓ పరమ భక్తుడిగా రవితేజ ఇందులో కనిపిస్తాడని అర్ధం అయింది. కానీ, సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ మొత్తం పూర్తి రక్తపాతంతో సాగుతుందట. ఇది రవితేజ పై వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ అని, రవితేజ పాత్ర సినిమాలో పూర్తి నేర నేపథ్యంలో రఫ్ గా ఉంటుందని.. ఈ కోణంలో ఈ సినిమా మొదటి సీక్వెన్స్ సాగుతుందట.

కాగా తన కూతురు కోసం తన హింసాత్మక గతం నుంచి బయట పడటం కోసం, హీరో పాత్ర అయ్యప్ప దీక్ష తీసుకుని జీవితాన్ని మార్చుకోవాలని చేసే ప్రయత్నంలో.. మళ్లీ పాత వైరం అడ్డుగా వస్తే.. ఈ కోణంలో సినిమా సాగుతుందట. సినిమాలో యాక్షన్‌ తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 21న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు