రైతు పాత్రలో కార్తీ అలరిస్తాడా ?
Published on Jun 4, 2018 8:31 pm IST

కార్తీ , సయేషా జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగులో’ చినబాబు’ గా రానుంది.ఇక నిన్న విడుదలైన ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. టీజర్ చూస్తుంటే కార్తీ రైతు పాత్రలో నటిస్తున్నాడని అర్దమవుతుంది. ఇక టీజర్ లో కార్తీ రైతుల గురించి పలికిన సంభాషణలు ఆలోచింప జేసేవిగా ఉన్నాయి.

తమిళ ,తెలుగు బాషలలో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాని తమిళ్ లో కార్తీ అన్నయ్య హీరో సూర్య నిర్మిస్తుండగా తెలుగులో ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి చినబాబు పేరుతో విడుదల చేస్తున్నారు. మరి కార్తీ రైతు పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో తెలియాలంటే ఈ చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook