మెగాస్టార్ డబుల్ ట్రీట్ గ్యారెంటీనా..?

మెగాస్టార్ డబుల్ ట్రీట్ గ్యారెంటీనా..?

Published on Aug 28, 2026 2:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ఈసారి దసరా బరి నుంచి దాదాపు తప్పుకుంది. దీంతో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని ఆలోచిస్తోంది. అయితే, జనవరి 13న చిరంజీవి మరొక సినిమా ‘కాకా’ విడుదల కానుండటంతో, కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలు రావడం కంటే 2027 సమ్మర్‌కి వాయిదా వేయడమే మంచిదని అభిమానులు భావిస్తున్నారు.

ఇక డిసెంబర్‌లో ఫౌజీ, NBK111, షారుఖ్ ‘కింగ్’ మరియు ‘ఎవెంజర్స్ డూమ్స్ డే’ వంటి భారీ సినిమాలు పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు బాకీ ఉండటంతో, పూర్తి ఔట్‌పుట్ చూసి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతలు ఒక స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

మరి అన్నీ అనుకున్నట్లు కుదిరితే నిజంగానే నెల రోజుల వ్యవధిలో మెగాస్టార్ డబుల్ ట్రీట్ ఇస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు