ఈ సారైనా ‘ప్లాప్’ల పరంపరకు బ్రేక్ పడుతుందా ?

ఈ సారైనా ‘ప్లాప్’ల పరంపరకు బ్రేక్ పడుతుందా ?

Published on Jul 16, 2019 6:40 PM IST

స్టార్ డమ్ తో పాటు టాలెంట్ పరంగా కూడా అగ్రహీరోగా కొనసాగుతున్న విక్రమ్ కి హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా విక్రమ్ సినిమాలు వస్తున్నయి వెళ్తున్నాయి తప్ప.. విక్రమ్ కి మాత్రం నిరాశే మిగులుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విక్రమ్ నుండి వస్తోన్న మూవీ ‘కదరం కొండన్’, తెలుగులో ‘మిస్టర్ kk’గా రాబోతుంది. సినిమా జూలై 19వ తేదీన విడుదల అవ్వనుంది. మరి ఈ సినిమాతోనైనా విక్రమ్ ప్లాప్ ల పరంపరకు బ్రేక్ పడుతుందా ? ఇప్పటికైతే సినిమా పై తమిళంలో భారీ అంచనాలు ఉన్నా.. తెలుగులో మాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో అంచనాలు లేవు. మరి ఆ అంచనాలను తలక్రిందులు చేసి.. ఈ సినిమా హిట్ అందుకుంటేమో చూడాలి.

కాగా కమలహాసన్‌ హీరోగా తూంగావనం చిత్రాన్ని తెరకెక్కించిన రాజేశ్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా తెరెకెక్కింది. ఈ సినిమాలో విక్రమ్‌ తన శైలి యాక్టింగ్ తో ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నాడు. పైగా విక్రమ్ గెటప్‌ కూడా కొత్తగా ఉంటుందట. కమలహాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్‌ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ సినిమాకి తెరకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు