NC25 : చైతూ మళ్ళీ ప్రేమ కథతో వస్తాడా?

NC25 : చైతూ మళ్ళీ ప్రేమ కథతో వస్తాడా?

Published on Feb 5, 2026 8:00 AM IST

Naga Chaitanya

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ‘విరూపాక్ష’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చైతన్య తన 24వ చిత్రం ‘వృషకర్మ’లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో మిస్టిక్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ రైటింగ్స్ మరియు SVCC బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ మరియు రఫ్ లుక్‌లో కనిపించనున్నాడు.

​’వృషకర్మ’ సెట్స్‌పై ఉండగానే, నాగచైతన్య తన కెరీర్‌లో మైలురాయి వంటి 25వ సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ ప్రాజెక్ట్ కోసం ఆయన మళ్లీ తనకు అచ్చొచ్చిన ప్రేమకథ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ఏ మాయ చేసావె’, ‘మజిలీ’, ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో క్లాస్ ఆడియన్స్‌కు దగ్గరైన చైతన్య, తన సిల్వర్ జూబ్లీ సినిమాను కూడా ఒక అందమైన ప్రేమకావ్యంగా మలచాలని భావిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘తండేల్’ చిత్రం ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా, అందులోని రొమాంటిక్ ట్రాక్‌కు మంచి గుర్తింపు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

​ఈ 25వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘మజిలీ’తో చైతన్యకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ లేదా ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘వృషకర్మ’ వంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించడం వల్ల కెరీర్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని చైతూ ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ‘వృషకర్మ’ భారీ విజయాన్ని అందుకుంటే, నాగచైతన్య మార్కెట్ స్టామినా మరింత పెరిగి, ఆయన 25వ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు