యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరీర్ కి చాలా కీలకంగా మారిన సినిమా మరియు ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న 25వ సినిమా కావడం వలన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎన్.టి.ఆర్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను పొందు పరుస్తూనే సుకుమార్ చాలా స్టైలిష్ గా ఈ సినిమా తెరకెక్కించాడు. మరో రెండు రోజుల్లో ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ కి తిరిగి రానుంది. ఇక్కడికి వచ్చాక బాలన్స్ ఉన్న రెండు సాంగ్స్ ని షూట్ చేయనున్నారు.
షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్ర టీం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియోని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఇంకా ఈ సినిమా కోసం ఓ సాంగ్ ని కంపోజ్ చేసి ఇవ్వాల్సి ఉందట, కానీ హఠాత్తుగా నిన్న దేవీశ్రీ ప్రసాద్ ఫాదర్ అయిన సత్యమూర్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. దాంతో నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్ అనుకున్న తేదీకి విడుదలవుతుందా? లేదా? అని సందేహాలు ఫిల్మ్ నగర్ లో నెలకొన్నాయి. ఎన్.టి.ఆర్, సుకుమార్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ లు కూడా ఈ విషయంలో దేవీశ్రీ ప్రసాద్ ని ఎలాంటిఇబ్బంది పెట్టడం లేదని అంటున్నారు.
ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


