‘లయన్’లో బాలయ్య హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?

‘లయన్’లో బాలయ్య హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.?

Published on May 1, 2015 12:44 AM IST

lion
గత ఏడాది నట సింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లెజెండ్ తర్వాత బాలకృష్ణ చేసిన లయన్ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను మరి కొద్ది రోజుల్లో జరుపుకోనుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. బాలకృష్ణ లయన్ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు.

బాలకృష్ణ చాలా కాలం సక్సెస్ లేకుండా ఉన్న టైంలో వచ్చిన ‘సింహా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేసాడు, ఆ తర్వాత బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ‘లెజెండ్’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా ‘లయన్’. ఆ రెండు సినిమాల్లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది, ఈ లయన్ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ బాగా వర్క్ అవుట్ అవుతుందని, ఈ సినిమా కూడా వాటిలానే బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ చిత్ర టీంలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్ర టీంతో పాటు, కొందరు అభిమానులు వర్క్ అవుట్ అవుతుంది అనుకుంటున్న ఈ డ్యూయల్ రోల్ సెంటిమెంట్ సక్సెస్ అవుతుందా.? లేదా అన్నది తెలియాలంటే మే 8వరకు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు