పవన్ అభిమానుల మద్దతు ఎవరికి..?

పవన్ అభిమానుల మద్దతు ఎవరికి..?

Published on Dec 5, 2014 10:00 AM IST

mukundaa-chinnadana-neekosa
ఈ ఏడాది చివరి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటి నెలకొంది. డిసెంబర్ 24న వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ సినిమా విడుదలవుతుంది. ఒక్క రోజు తర్వాత నితిన్ ‘చిన్నదాన నీకోసం’ అంటూ హిట్ కోసం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో పవన్ అభిమానుల మద్దతు ఎ సినిమాకి దక్కుతుంది..? ముందు ఎ సినిమాకు ప్రాధాన్యత ఇస్తారు..? అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న వరుణ్ తేజ్, ‘ముకుంద’ ఆడియోలో తన మాటలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక నితిన్, పవన్ కు వీరాభిమాని అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క రోజు వ్యవ్యధిలో వీరిద్దరి సినిమాలు విడుదలవుతున్నాయి. రెండు సినిమాలు యువతరం ప్రేమకథల నేపధ్యంలో తెరకేక్కినవే. క్లాస్ సినిమాలే. ‘ముకుంద’లో పల్లెటూరి పండుగ వాతావరణం సుస్పష్టంగా కనబడితే, ‘చిన్నదాన నీకోసం’లో కాస్త మోడరన్ టచ్ కనబడుతుంది. రెండిటిపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఏది విజయం సాధిస్తుందో.? వేచి చూడాలి.

గతంలో సెలవులు, పండుగ సమయాలలో ఈ తరహా సందర్భాలు ఎదురయ్యాయి. అగ్ర హీరోలు నటించిన రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి, అదే రీతిలో ‘ముకుంద’, ‘చిన్నదాన నీకోసం’ సినిమాలు విజయ కేతనం ఎగురవేయాలని.. పవన్ అభిమానులు, ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరించాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు