రష్యా నుండి రాగానే పవన్ దానిపై స్పష్టత ఇచ్చేస్తారా..?

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత కొంచెం విరామం తీసుకున్నారు. ఆయన క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కొరకు సతీసమేతంగా రష్యా వెళ్లడం జరిగింది. కొద్దిరోజులలో తిరిగి రానున్న పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేస్తారంటూ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. పవన్ సినిమాలలోకి రీఎంట్రీ పై స్పష్టత ఇవ్వనున్నారని చాలా మంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ 2018లో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తరువాత రాజకీయాలకే పరిమతం అయ్యారు. ఆయన వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది.

కాగా ఆయన వచ్చే ఏడాది రెండు చిత్రాలు చేయన్నారు. ఒకటి హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ కాగా రెండవది దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నాయి. పింక్ రీమేక్ ని నిర్మిస్తున్న దిల్ రాజు ఇప్పటికే పింక్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఆయన పవన్ పేరు బయటపెట్టలేదు. షూటింగ్ షెడ్యూల్ కి సమయం దగ్గర పడుతుండటంతో ఈ విషయాన్ని పవన్ తన రష్యా పర్యటన అనంతరం బయటపెట్టనున్నారని తెలుస్తుంది.

Exit mobile version