ఇలా అయితే ప్రభాస్ కి కష్టమే..!

Published on Mar 23, 2020 8:59 am IST


కరోనా వైరస్ పరిస్థితులను ఒక్కరిగా మార్చివేసింది. ప్రపంచం తలకిందులై పోయింది. కోవిడ్ 19 వైరస్ కారణంగా పలు వ్యాపార సంస్థలు మూత పడగా చిత్ర పరిశ్రమ మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. థియేటర్స్ మూసివేయడం తో పాటు, నూతన చిత్రాల విడుదల ఆగిపోయింది. అలాగే ఈనెల 31వరకు షూటింగ్స్ సైతం నిలిపివేయాలంటూ ఆంక్షలు విధించడం జరిగింది.

కాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ షూటింగ్ సైతం నిలిచిపోయింది. అనేక కారణాల చేత నత్త నడక సాగుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊపందుకుంది. కానీ ఇంతలోనే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. పీరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. పరిస్థితులు చక్క బడి యధా స్థితికి చేరితే, షూటింగ్ ముందుకు సాగే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రభాస్- పూజ హెగ్డేల ఈ మూవీని 2021లో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :