రావణుడి పాత్రలో ప్రభాస్ నటిస్తాడా ?

Published on Sep 17, 2019 7:13 pm IST

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ వందల కోట్లలోనే ఉండనుంది. ఇందులో రాముడి పాత్రలో హృతిక్ రోషన్ నటించనుండగా, సీత పాత్ర కోసం దీపికా పదుకొనేను తీసుకున్నారు.

ఇక మరొక కీలకమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారాట. ప్రస్తుతం ‘సాహో’ ప్రభాస్ హిందీ ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ పొందాడు కాబట్టి బిజినెస్ పరంగా కూడా వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారట.

మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్టవుతుందో చూడాలి. ఇకపోతే మూడు బాగాలుగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకులు నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ తెరకెక్కించనున్నారు. 2021 నాటికి ఇందులోని మొదటి భాగం విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More