మరో ప్రయోగంతో నటకిరీటి విజయం అందుకుంటాడా.?

మరో ప్రయోగంతో నటకిరీటి విజయం అందుకుంటాడా.?

Published on Jul 20, 2014 5:00 PM IST

tommy

ఒకప్పటి కామెడీ కింగ్ అంటే టక్కున చెప్పే పేరు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఎన్నో రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ ‘మేడం’ సినిమాలో లేడీ గెటప్ లో, ‘రాంబంటు’ సినిమాలో కోతి పోలికలు ఉన్న పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన టామీ అనే సినిమాతో మరో కొత్త ప్రయోగం చేయనున్నాడు.

‘టామీ’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ టామీ అనే కుక్కతో కలిసి కనిపించనున్నాడు. వీళ్ళిద్దరి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఒక డిఫరెంట్ స్టొరీ లైన్ తో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కనుంది. రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయంలో చాలా ఆసక్తికరంగా ఉన్నాడు. 20వ శతాబ్దంలో జర్మనీలో ఓ రియల్ డాగ్ కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మక సినిమాతో నటకిరీటి విజయం అందుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు