రజినీకాంత్ డిస్ట్రిబ్యూటర్ ల క(న)ష్టాన్ని తీర్చనున్నాడా?

రజినీకాంత్ డిస్ట్రిబ్యూటర్ ల క(న)ష్టాన్ని తీర్చనున్నాడా?

Published on Dec 24, 2014 4:00 AM IST

Linga
‘లింగ’ సినిమా భారీ లాస్ ని చవిచూసిన నేపధ్యంలో తమిళ డిస్ట్రిబ్యూటర్ ల అందరూ కలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రోజురోజుకీ ఈ పోరాటం మరింత ఉదృతమవుతుంది. డిస్ట్రిబ్యూటర్ లందరూ చెన్నైలో వున్న రజినీకాంత్ చారిటి విభాగాలలో ఒకటైన రాఘవేంద్ర కళ్యాణ మండపం దగ్గర ఆందోళన చేపట్టనున్నారు

ఈ వార్తలన్నీ విన్న సూపర్ స్టార్ డిస్ట్రిబ్యూటర్ లను కలిసే నిర్ణయం తీసుకున్నాడు. సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్ లు ఎంత నష్టపోయారో తెలుసుకుంటారని సమాచారం. అయితే ఈ నష్టాన్ని రజినీ వారికి తిరిగి చేల్లిస్తాడా లేదా అన్న విషయం ఇంకా తేలాల్సివుంది

తాజా వార్తలు