
ఒకరేమో హీరోగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, స్టైల్ కి బ్రాండ్ అంబాసిడర్ అతనే మన తలైవా రజినీకాంత్, మరొకరు ఎలాంటి మెసేజ్ ని అయినా కమర్షియల్ గా చెప్పడంలో దిట్ట, అలాగే ఇండియన్ సినిమాకి గ్రాండ్ విజువల్స్ ఎఫెక్ట్స్ ని పరిచయం చేసిన డైరెక్టర్, అతనే సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘శివాజీ’ అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ‘రోబో’ శివాజీ రికార్డులని మాత్రమే కాకుండా ఎవ్వరూ రికార్డ్ బ్రేక్ చెయ్యలేని రేంజ్ లో హిట్ అయ్యింది.
చాలా రోజుల నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా ఉంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో మూడవ సినిమా ఉంటుందని అన్నారు. అలాగే ఇప్పటికే శంకర్ చెప్పిన స్టొరీ లైన్ కి రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఫిబ్రవరి 14న ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానులు ఆ సినిమా రోబోకి సీక్వెల్ అని అనుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన లింగ హిట్అవ్వలేదు , అలాగే శంకర్ ఐ కూడా పెద్దగా ఆడలేదు. దాంతో వీరిద్దరూ ఈ సారి సూపర్ హిట్ తో వస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.