రజినీ రీరిలీజ్ ‘బాహుబలి’ రికార్డ్స్ కొడుతుందా?

padayappa

ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్స్ లో కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. తన స్టార్డం సెట్ చేసిన వండర్స్ ఎన్నో ఉన్నాయి. ఇలా రజినీకాంత్ ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చూడని హై మూమెంట్ లేదు అలానే లో మూమెంట్ కూడా లేదు. మరి తన కెరీర్ లో రికార్డులు బ్రేక్ చేసిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో “నరసింహ” కూడా ఒకటి.

తమిళ్ లో “పడయప్ప” గా తెలుగులో నరసింహ గా దుబ్బింగ్ అయ్యి వచ్చి మన దగ్గర కూడా భారీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా 25 ఏళ్ళు పూర్తి కావడం రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి కాబోతున్న సందర్భంగా ఈసారి రజినీకాంత్ పుట్టినరోజుకి డిసెంబర్ 12న ఈ సినిమాని రీరిలీజ్ కి కన్ఫర్మ్ చేశారు. కోలీవుడ్ లో దీనికి బజ్ గట్టిగానే ఉంది. పైగా ఓవర్సీస్ లో కూడా గట్టి రిలీజ్ ఉంటుంది.

సో రజినీ మార్కెట్ పరంగా ఈ ఐకానిక్ సినిమా రీరిలీజ్ లో రికార్డులు సెట్ చేస్తుందనే చాలా మంది భావిస్తున్నారు. విజయ్ నటించిన పాత సినిమా ‘గిల్లీ’ నే 30 కోట్లకి పైగా రాబట్టింది. అలాంటిది రజినీకాంత్ నుంచి ఇంత హైప్ నడుమ సినిమా అంటే బాహుబలి ది ఎపిక్ నే టార్గెట్ కావచ్చని కూడా అంటున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా సెన్సేషన్ సెట్ చేస్తుందా లేదా అనేది చూడాల్సిందే.

Exit mobile version