టాలీవుడ్ కి ఎంతో అవసరమైన కీలక హిట్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ తో అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కొన్ని కీలక ప్రాంతాల్లో అయితే పెద్ది రన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే ఇదంతా వీకెండ్ వరకు స్ట్రాంగ్ హోల్డ్ లోనే కొనసాగింది. కానీ అస్సలు అగ్ని పరీక్ష ఇక నుంచి మొదలవుతుంది అని చెప్పాలి.
ఎలాంటి సినిమా అయినా కూడా వర్కింగ్ డే సోమవారం నుంచి డ్రాప్స్ చూడడం అనేది గ్యారెంటీ కానీ అది ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ముఖ్యమైన పాయింట్. ఈ రోజుల్లో కూడా సినిమా రన్ అయ్యింది అంటే అప్పుడు అది బ్లాక్ బస్టర్ లెక్క లోకి వస్తుంది. ఇప్పుడు పెద్ది ముందు దీనితో పాటుగా మరో రిస్క్ తో కూడిన సవాలు దాటాల్సి ఉంది.
మొదటి వీకెండ్ జనం బాగానే చూసేసారు కానీ చాలామంది సోమవారం నుంచి టికెట్ ధరలు సాధారణ రేటుకి వస్తాయని భావించారు. కానీ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా రేట్లు మారలేదు. సో వీక్ డేస్ లో కూడా అదే భారీ ధరలతో జనం చూడాలి అంటే కొంచెం కష్టమే అనుకోవాలి. సో పెద్ది దీనిని అధిగమిస్తుందా లేదా అనేది చూడాల్సిందే.


