ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని రామ్ పట్టుదలతో ఉన్నాడు.
అయితే, రామ్ హీరోగా ఒక డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా ఉంటుందని.. అలాగే ఆర్కా మీడియా బ్యానర్‌లో ప్రాజెక్ట్ ఉంటుందనే వార్తలు ఇటీవల సినీ సర్కి్ల్స్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన ఇమేజ్‌కు సరిపోయే పక్కా కమర్షియల్ అండ్ ఎమోషనల్ కథలు వినేందుకు సిద్ధమవుతున్నాడట.
ఈ క్రమంలో రామ్‌కు ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల మళ్ళీ ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రామ్ ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే మేకర్స్ ఇంకా దర్శకుడి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే రామ్ కిషోర్ తిరుమలతో మరోసారి చేతులు కలుపుతాడా అనేది చూడలి.


