ప్రభాస్-రానా లపై క్రేజీ రూమర్..!

ప్రభాస్-రానా లపై క్రేజీ రూమర్..!

Published on May 17, 2020 7:01 PM IST

prabhas rana
ఇద్దరు ఆజానుబాహులు సముజ్జీలైన శత్రువులుగా చేస్తే…వారి మధ్య పోరు ఏ స్థాయిలో ఉంటుందో బాహుబలిలో చూశాము. ప్రభాస్ బాహుబలిగా, రానా బల్లాల దేవుడిగా వెండి తెరపై అద్భుతం చేశారు. హీరోతో సమానమైన పాత్ర చేసిన రానా కుటిల బుద్ది కలిగిన బలమైన రాజు పాత్రలో ఆకట్టుకున్నారు. కాగా మరో మారు ఈ కాంబినేషన్ తెరపైన మెరవనుంది అని కొద్దిరోజులుగా ఓ క్రేజీ రూమర్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది.

డైరెక్టర్ దశరథ్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మిస్టర్ ఫర్ఫెక్ట్ చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై కూడా ప్రేక్షకులలో అంచనాలున్నాయి. కాగా ఈ సినిమా లో హీరో , విలన్ పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉన్నందున డైరెక్టర్ దశరథ్ విలన్ పాత్ర కోసం రానాను కలిశారట.అలాగే ఈ సినిమాకు ప్రభాస్ , రానాలు ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు