సాహో , సైరా తో పోటీ పడనుందా ?

సాహో , సైరా తో పోటీ పడనుందా ?

Published on Jul 29, 2018 4:15 PM IST

saaho syera1

‘రన్ రాజా రన్’ ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఇటీవల దుబాయ్ లో తెరకెక్కించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం తో బాక్సాఫిస్ వద్ద పోటీపడే అవకాశాలున్నాయి. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క భారీ షెడ్యూల్ ఇటీవల హైద్రాబాద్ లో ముగిసింది. ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దాంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ తప్పదంటున్నారు.

తాజా వార్తలు