టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇపుడు నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ చిత్రమే శుభం. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో నటీనటులు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపుడిలతో చేసిన సినిమానే “శుభం”.
ట్రైలర్ తో మంచి బజ్ ని అందుకున్న ఈ చిత్రంలో ఎప్పుడు చూడని విధంగా సీరియల్స్ తో కూడిన హారర్ చిత్రాన్ని ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మొన్న ప్రీరిలీజ్ లో కూడా రచయిత వసంత్ సీరియల్స్‌ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ నాకు వాటిపై చాలా గౌరవం ఉంటుంది. అదే ఇందులో హారర్ ఫాంలో చూపించాం. అని తెలిపాడు. దీనితో నిర్మాతగా సమంత చేసిన ఈ ఇంట్రెస్టింగ్ సీరియల్ ప్రయత్నం వర్క్ అయ్యేలానే కనిపిస్తుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతుండగా ఈ మే 9న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.