మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 17వ సినిమాని దర్శకుడు సుకుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని గ్రాండ్ గా రీసెంట్ గానే లాంచ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఇంకా నటీనటుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యంగా హీరోయిన్ గా ఎవరిని పెట్టాలి అనేది కత్తి మీద సాముగా మారిన పరిస్థితి.
అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా చాలామంది పేర్లే వినిపించాయి. వారిలో లేటెస్ట్ బ్యూటీ సాత్విక పేరు ఫైనల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు విడుదల అయ్యిన ఆకాశంలో ఒక తార సినిమాతో పరిచయం అయ్యిన ఈ తెలుగు బ్యూటీ తన మొదటి సినిమా తోనే పెర్ఫామర్ గా మంచి మార్కులు కొట్టేసింది.
ఇక ఎలాగో చరణ్ సినిమా విషయంలో ముందు నుంచీ ఆమె పేరు రేస్ లో ఉంది కాబట్టి ఈ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ ని కూడా ఆమె కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సెట్స్ మీదకి వెళ్లే ఛాన్స్ ఉంది.


