శేఖర్ కమ్ముల నెక్స్ట్ స్టార్ హీరోతోనా?

Published on May 23, 2020 9:02 am IST

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మళ్ళీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఆ సినిమా తరువాత యంగ్ స్టర్స్ తో హ్యాపీ డేస్ తరహా మూవీ స్టార్ట్ చేశారు. కారణాలేమైనా ఆ మూవీ మధ్యలో ఆగిపోయింది. కాగా శేఖర్ ప్రస్తుతం నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీ చేస్తున్నారు. సెన్సిబుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది.

ఐతే ఈ చిత్రం తరువాత శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరోతో మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన త్వరలో వివరాలు వెల్లడిస్తాడట. కాగా ఈ చిత్రానికి నిర్మాతలుగా ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీని తెరకెక్కిస్తున్న ఏషియన్ సునీల్, నారాయణ్ దాస్ నారంగ్ ఉన్నారట. దీనిపై ఒప్పదం కూడా కుదిరిందని వినికిడి. శేఖర్ కమ్ములతో చేయనున్న ఆ స్టార్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ త్వరలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More