
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల సూపర్ క్రేజీ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి నెలలో లాంచనంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అఫీషియల్‌గా అనౌన్స్ కాకముందునుంచే ఈ కాంబినేషన్‌పై సర్వత్రా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
శ్రీమంతుడు సినిమాతో సూపర్ హిట్ జోడీగా మారిపోయిన మహేష్-శృత హాసన్‌ల కాంబో ఆ తర్వాత క్రేజీగా మారిపోయింది. ఈ కాంబినేషన్‌ను మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నాలు కూడా అప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మురుగదాస్-మహేష్‌ల సినిమాకు శృతి హాసన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తూండడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం. ఇక తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక బలమైన సోషల్ చెప్పాలనుకునే మురుగదాస్, మహేష్‌కు కూడా ఓ మంచి కథాంశాన్ని రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ చేస్తోన్న బ్రహ్మోత్సవం పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా మురుగదాస్-మహేష్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

