బన్నితో అయినా.. సునీల్ నవ్వులు పూయిస్తాడా..?

Sunil

అందాల రాముడు చిత్రంతో సోలో హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్న, పూలరంగడు వంటి హిట్స్ అందుకున్నారు. ఆతరువాత ఆయన నటించిన ఏ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. లేదు దీనితో మళ్ళీ ఫుల్ టైం కమెడియన్ గా మారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. సిక్స్ ప్యాక్ తో మాస్ హీరోగా కనిపించిన సునీల్ కామెడీ గతంలోలా పేలడంలేదు. ఇటీవల అయన చేసిన చిత్రలహరి, చాణక్య వంటి చిత్రాలలో ఆయన కామెడీ అంతగా మెప్పించలేదు. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురంలో చిత్రంలో సునీల్ హాస్యానికి ఆస్కారం ఉన్న మంచి రోల్ చేస్తున్నారు.

బన్నీ అతిథిగా వెళ్లే వైకుంఠపురం అనే విలాసవంతమైన భవంతిలో కుటుంబ సభ్యుడిగా సునీల్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ బన్నీ, సునీల్ కి మధ్య ఆ ఇంటిలో నడిచే సన్నివేశాలు హిలేరియస్ కామెడీ ఉండేలా రాశారట. ఈ సన్నివేశాలు తెరపై నవ్వులు పూయించడం ఖాయం అంటున్నారు. మరి అల వైకుంఠపురంలో సినిమాతో నైనా సునీల్ కమెడియన్ గా తన సత్తా చాటుతాడో లేదో చూడాలి. బన్నీకి జంటగా పూజ హెగ్డే నటిస్తుండగా జనవరి 12న ఈ చిత్రం విడుదల అవుతుంది. థమన్ అలవైకుంఠపురంలో చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version