బాలీవుడ్ లో ఉన్న అపనమ్మకాన్ని తమన్నా బ్రేక్ చేయనుందా?

బాలీవుడ్ లో ఉన్న అపనమ్మకాన్ని తమన్నా బ్రేక్ చేయనుందా?

Published on Apr 30, 2014 11:03 PM IST

Tamanna

బాలీవుడ్ లో మొదటి సారి తమన్నా నటించిన సాజిద్ ఖాన్ చిత్రం హిమ్మత్ వాలా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో తమన్నా బాలీవుడ్ లో ఫెయిల్ తో తన కెరీర్ ను ప్రారంభించింది. అయినా కూడా హంషకల్స్ తో సహా మరో రెండు చిత్రాలను ఆమె ఒప్పుకుంది.

హిందీ లో మరోసారి సాజిద్ ఖాన్ తీసిన హంషకల్స్ లో తమన్నా నటించింది. సైఫ్ అలీఖాన్ తో కలిసి ఈ కామెడీ చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు. తమన్నా ఈ చిత్రంలో మంచి పాత్ర చేసినట్లు ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. హిమ్మత్ వాలా లో ఒకే హీరోయిన్ కనిపించే చిత్రం కాకుండా, బిపాషాబసు, ఈషా గుప్త, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ లు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ ముగ్గురు కూడా మూడు పాత్రలు పోషించనున్నారు.

హంషకల్స్ చిత్రం విజయం సాధిస్తే తమన్నా కెరీర్ మంచి స్దాయికి చేరుకుంటుంది. సాజిద్ ఖాన్ కూడా ఈ చిత్ర విజయంపై కన్నేశారు. తమన్నా బాలీవుడ్ లో ఉన్న అపనమ్మకాన్ని బ్రేక్ చేస్తుందా ? అని ఒక్కరు కూడా ప్రస్తుతం అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచిచూద్దాం.

తాజా వార్తలు