నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’. ఈ సినిమా డీసెంట్ రివ్యూస్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ తో మంచి హిట్ అనిపించుకుంది. ఆ ఉత్సాహంతోనే శైలేష్ కొలను నెక్స్ట్ ‘హిట్ 2’ కూడా తీస్తానని ప్రకటించాడు. కానీ అంతలో రాజ్ కుమార్ రావ్ హీరోగా హిట్ హిందీ రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం శైలేష్ కొలనుకు దక్కింది.
రాజ్ కుమార్ రావ్ సైతం హిట్ హిందీ రీమేక్ లో నటిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే జెర్సీ మూవీని షాహిద్ కపూర్ తో హిందీలో రీమేక్ చేస్తున్న దిల్ రాజు మరో నిర్మాత కుల్దీప్ రాథోడ్ తో కలిసి హిట్ మూవీ నిర్మిస్తున్నారు.
కాగా హిట్ సినిమాని చక్కగా రూపొందించి శైలేష్ కొలను ప్రేక్షకుల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. కానీ తెలుగు ప్రేక్షుకులకు హిట్ లాంటి కథాంశం ఉన్న సినిమా కొత్త. దాంతో తెలుగులో ఈ సినిమాకి ప్రెష్ ఫీలింగ్ వచ్చింది. కానీ హిందీ ప్రేక్షకులకు హిట్ లాంటి కంటెంట్ థ్రిల్లర్ సినిమాలు మాములే. మరి హిట్ ను వాళ్ళు ఎలా ఆదరిస్తారో.. డైరెక్టర్ శైలేష్ కొలనుకు హిందీలో ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.


