బన్నీతో మహేష్ డైరెక్టర్ సినిమా ఉంటుందా ?

Published on Apr 4, 2021 5:50 pm IST

‘మహర్షి’ తరువాత కూడా డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నా కుదరలేదు. అయితే ఆ తరువాత అల్లు అర్జున్ తో తన సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. బన్నీ కూడా వంశీతో సినిమాకి ఒప్పుకున్నాడని రూమర్స్ వినిపించాయి. పైగా వంశీ పైడిపల్లి, బన్నీకి ఫుల్ స్క్రిప్ట్ కూడా వినిపించాడని.. బన్నీ కూడా కథ విని బాగుందని చెప్పాడని కూడా అన్నారు.

మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, అల్లు అరవింద్ కి కూడా కథ నచ్చిందని ఈ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా చెప్పాలంటే.. కేజీఎఫ్ మూవీలా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో ఈ సినిమా సాగుతోందని.. ముఖ్యంగా బన్నీకి ఇది మరో పాన్ ఇండియా మూవీలా వంశీ పైడిపల్లి ఈ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడని ఇలా అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. అసలు ఇంతకీ బన్నీతో వంశీ సినిమా ఉంటుందా !

సంబంధిత సమాచారం :