తన క్రేజ్ తో ఈ హీరోయిన్ హిట్ ఇస్తుందా ?

Published on Apr 18, 2019 4:01 pm IST

ఛ‌లో, గీత గోవిందం చిత్రాల‌తో వరుస విజ‌యాలను అందుకుని టాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ర‌ష్మిక మంద‌న‌. ప్ర‌స్తుతం రష్మిక మ‌రో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

`గీతా .. ఛ‌లో` అనే సినిమాతో ఈ నెల 26న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ కన్నడ బ్యూటీ. మరి గీత గోవిందం, ఛ‌లోకు వచ్చిన పేరును క్యాష్ చేసుకోవటానికి మామిడాల శ్రీ‌నివాస్, దుగ్గివ‌ల‌స‌ శ్రీ‌నివాస్ సంయుక్తంగా ఈ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారు.

మరి ఈ నిర్మతలకు ర‌ష్మిక మంద‌న‌ తన క్రేజ్ తో ఎంతవరకు హిట్ ఇస్తుందో చూడాలి. కాగా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ `గీతా .. ఛ‌లో` చిత్రం దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ రాజేశ్వ‌రి ఫిలింస్ – మూవీ మాక్స్ బ్యాన‌ర్ల‌ పై విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :