‘విక్రమసింహ’ ఎటువంటి అవాంతరాలు లేకుండా విడుదల అవుతుందా?

‘విక్రమసింహ’ ఎటువంటి అవాంతరాలు లేకుండా విడుదల అవుతుందా?

Published on May 23, 2014 12:30 AM IST

vikrama-simhaa
సూపర్ స్టార్ చిత్రం ‘విక్రమసింహ’ ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూనే వుంది. గతంలో ఒకసారి ప్రకటించిన తారిఖున విడుదల కాలేకపోయిన ఈ చిత్రాన్ని మే 23 కి వాయిదా వేసారు. కాని ఇప్పటికీ ఈ చిత్రం రిలీజ్ విషయం ప్రశ్నార్దకంగానే వుంది.

ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్న వదంతుల ప్రకారం చివరి నిమిషంలో ఈ చిత్రానికి అవసరమైన వ్యక్తులనుంచి రావలసిన ఫినాన్షియల్ క్లియరెన్సులు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో బుకింగ్ నిలిపివేయడంతో ఈ వదంతులకు బలంచేకూరింది.

కొంతకాలం క్రితం ఎరోస్ సంస్థ ఈ చిత్రాన్ని సాఫిగా విడుదల చేయాడానికి నడుంకట్టినప్పటికి ఇటువంటి సమస్యలు రావడం ఆశ్చర్యంగా వుంది. ఈ విషయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

తాజా వార్తలు